Lips Beauty Tips: సిగరెట్​ తాగితే పెదాలు నల్లగా...  ఇలా చేస్తే ఎర్రగా మారుతాయి

Lips Beauty Tips: సిగరెట్​ తాగితే పెదాలు నల్లగా...  ఇలా చేస్తే ఎర్రగా మారుతాయి

ధూమపానం చేసే వారికి నల్లటి పెదాలు ఉంటాయి. నల్లటి పెదాలకు సిగరేట్ తో  పాటు అనేక కారణాలు కూడా ఉన్నాయి. సిగరెట్​ లో ఉండే తారు నికోటిన్​ పదార్ధాలు పెదవికి ఉండి నల్లగా మారుతాయి. పెదవులపై నల్లటి మచ్చలు రావడానికి గల కారణాలు.... వాటిని తొలగించే మార్గాల గురించి  విషయాలు తెలుసుకుందాం.  

Black Lips: అందమైన చిరునవ్వు ఇచ్చే పెదాలను ఎంతో అందంగా ఉంచుకోవాలని ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. దంతాలు, పెదవుల మధ్య చిరునవ్వును ప్రతిఒక్కరిని ప్రభావితం చేస్తాయి. అయితే కొందరిలో నల్లటి పెదవుల గురించి కొన్ని అపోహలు ఉంటాయి. ధూమపానం చేసే వారికి మాత్రమే నల్లటి పెదాలు ఉంటాయనుంటారు. అది అలా కాదు..పెదవి పిగ్మెంటేషన్​కు  అనేక ఇతర కారణాల వలన ఉండవచ్చని నిపుణులు అంటున్నారు.పెదవుల చర్మం శరీరం చర్మం కంటే సన్నగా ఉంటుంది. అందువలన అవి త్వరగా ఎండటం, పగుళ్లు వస్తాయి. 

పెదవులు ఎర్రగా, ఆకర్షణీయంగా కనిపించడం కోసం అమ్మాయిలు లిప్ స్టిక్స్ ఉపయోగిస్తారు. ప్రతి మేకప్ కిట్ లో ఇవి ముఖ్యమైన భాగమే. వీటిని వేసుకోవడం వల్ల ప్రత్యేకంగా కనిపిస్తారు. కానీ లిప్ స్టిక్ వల్ల పెదాలు ఎర్రగా మాత్రమే కాదు కొంతమందిలో నల్లగా కూడా మారిపోతాయి. అందుకు కారణం లిప్ స్టిక్ లో ఉపయోగించే రసాయనాల వల్ల పిగ్మెంటేషన్ కి కారణమవుతుంది. చర్మ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి, పెదవులపై శ్రద్ధ వహించడం, పెదాలు నల్లబడకుండా పిగ్మెంటేషన్ బారిన పడకుండా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

పెదాలను  డీహైడ్రేడ్​గా ఉంచుకోవాలి: పెదవులు పొడిబారకుండా ఉండాలంటే హైడ్రేట్ గా ఉండేందుకు  ఎక్కువ నీరు తాగాలి. సూర్యుని  కిరణాలు నుంచి పెదవులను రక్షించడానికి SPFతో లిప్ బామ్ రాయాలి.రోజంతా హైడ్రేటింగ్ లిమ్ బామ్, పెట్రోలియం జెల్లీ ని అప్లై చేయండి. పెదాలు తేమగా ఉంటాయి. పెదవులు కొరకడం మానుకోవాలి.. నొక్కి ఉంచడం వల్ల పెదవులు దెబ్బ తింటాయి. సహజ నూనెలు, తేమగా, పొడిబారకుండా ఉంటాయి.పెదవులు పొడిబారకుండా కాపాడుకోవడానికి సున్నితమైన, హైడ్రేటింగ్ లిప్ బామ్ లను ఎంచుకోవాలి.

మాయిశ్చరైజర్: పొడి, పగుళ్లు పిగ్మెంటేషన్ కి కారణమవుతాయి. అందుకే పెదవులు మాయిశ్చరైజింగ్ కీలకం. సహజమైన బీస్ వాక్స్, షియా బటర్ లేదా కోకో బటర్ తో లిప్ బామ్ ను అప్లై చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఇవి పెదాలను తేమగా, మృదువుగా ఉంచుతాయి. తరచూ ఈ విధంగా చేయాలి.

ఎక్స్ ఫోలియేట్ చేయాలి: పెదాలని ఎక్స్ ఫోలియేట్ చేయడం వల్ల చర్మం కొంత గాలి పీల్చుకునేలా చేస్తుంది. మృతకణాలు, మురికిని తొలగిస్తుంది. ఈ మలినాలు తరచుగా పిగ్మెంటేషన్ కు కారణమవుతాయి. వాటిని పోగొట్టేందుకు చక్కెర, కొబ్బరి నూనె ఉపయోగించాలి. వీటిని పేస్ట్ మాదిరిగా చేసి పెదవులపై కొన్ని నిమిషాల పాటు రుద్దాలి. ఆపై గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

పడుకునే ముందు శుభ్రం చేసుకోవాలి: రాత్రంతా లిప్ స్టిక్ ఉంచడం వల్ల పిగ్మెంటేషన్ వస్తుంది. అందుకే పడుకునే ముందు లిప్ స్టిక్ శుభ్రం చేసుకోవాలి. లిప్ స్టిక్ తొలగించడానికి సున్నితమైన మేకప్ రిమూవర్ లేదా కొబ్బరి నూనె ఉపయోగించాలి. లిప్ స్టిక్ తీసేసిన తర్వాత పెదాలు తేమగా ఉండాలంటే లిప్ బామ్ రాసుకోండి.

లిప్ ప్రైమర్: లిప్ స్టిక్ అందంగా కనిపించేందుకు లి ప్రైమర్ చాలా ప్రభావవంతంగా పని చేస్తుంది. కొన్ని లిప్ స్టిక్స్ లో పిగ్మెంటేషన్ కి కారణమయ్యే పదార్థాలు ఉంటాయి. సీసం, పారాబెన్, సల్ఫేట్ లేని లిప్ స్టిక్స్ ఎంచుకోవాలి. జోజోబా ఆయిల్, విటమిన్ ఇ, బీస్వాక్ వంటి సహజ మూలకాలతో కూడిన లిప్ స్టిక్ లు ఉత్తమమైనవి. పెదవుల నుంచి రక్తస్రావం కాకుండా ఇది అడ్డుకుంటుంది. అందుకే లిప్ స్టిక్ రాసుకునే ముందు పెదవులకు కొద్దిగా లిప్ ప్రైమార్ వేసుకుంటే మంచిది. హాని చేసే రసాయనాలు లేని లిప్ స్టిక్స్ ఎంచుకోవాలి. అప్పుడే చర్మం రంగు మారిపోకుండా అడ్డుకుంటుంది. సరైన చిట్కాలు పాటించి పెదాలు నల్లబడకుండా నిరోధించవచ్చు. మీరు ఇలా చేశారంటే పెదాలు అందంగా, ఆరోగ్యంగా ఉంటాయి.

పెదవులపై నల్ల మచ్చలకు కారణాలు:

  • కొన్నిసార్లు కొత్త బ్యూటీ వస్తువులు రాస్తే అలెర్జీ వచ్చే అవకాశం ఉంది. అందువలన కూడా పెదవులపై నల్ల మచ్చలు వస్తాయి. ఈ సమస్యని అలెర్జీ కాంటాక్ట్ చీలిటిస్, పిగ్మెంటెడ్ కాంటాక్ట్ చీలిటిస్ అంటారు. టూత్ పేస్ట్, మౌత్​ వాష్​ , హెయిర్ డై, సువాసన, లిఫ్​ స్టిక్​, లిప్ బామ్, ఫ్లేవర్, గ్రీన్ టీలో ఉండే నికెల్ వల్ల ఈ సమస్యలు వస్తాయి.
  • శరీరంలో ఐరన్​ ఎక్కువుగా నిల్వ ఉంటే  చర్మంపై నల్లటి మచ్చలు, అలసట, కాలేయ సమస్యలు, నొప్పి వంటి సమస్యలు వస్తాయి. పెదాలు నల్లగా కనిపిస్తే.. వాటిని ఒకసారి చెక్ చేయించుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
  • ఇది సూర్యరశ్మి, UV కిరణాల వల్ల కలిగే నష్టం వల్ల ఆక్టినిక్ కెరాటోసిస్ వస్తుంది. దీనికి వృత్తిపరమైన సంరక్షణతోపాటు, చర్మవ్యాధి నిపుణులను సంప్రదిస్తే మంచిదంటున్నారు.
  • విటమిన్ బి12 లోపం వల్ల చర్మం రంగు నల్లగా మారుతుంది. ఇది రక్తహీనత, నోటి పూతల, చిరాకు, ఎరుపు నాలుక, గొంతు నొప్పి, లేత చర్మం వంటి ఇతర లక్షణాలను సూచించవచ్చు. ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు డాక్టర్ సలహాపై మల్టీవిటమిన్లను తీసుకుంటే మంచిది.
  • పెదవులపై నల్ల మచ్చలు రాకుండా ఉండాలంటే హానికరమైన UV కిరణాల నుంచి రక్షించడానికి SPFతో లిప్ బామ్,  నీరు త్రాగండి, మాయిశ్చరైజింగ్ లిప్ బామ్, క్రీమ్ అప్లై చేయాలి.క్రమం తప్పకుండా ఎక్స్​ఫోలియేట్ చేయాలి. నియాసినామైడ్, విటమిన్ సి, కోజిక్ యాసిడ్, లైకోరైస్ ఎక్స్​ట్రాక్ట్ వంటి పదార్థాలు,  విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలంటున్నారు.

  •